SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

మహేష్ బాబు 28 సినిమాల్లో నటించాడు. ఆల్మోస్ట్ అన్ని రకాల పాత్రలు చేశాడు. ‘రాజకుమారుడు’లో శక్తిమాన్ టైపులో కనిపించాడు. ‘టక్కరి దొంగ’ లో కౌబాయ్ గా, నానిలో చంటిపిల్లాడుగా, ‘అతడు’ క్లైమాక్స్ లో జేమ్స్ బాండ్ టైపు లుక్లో, ‘పోకిరి’ లో పోలీస్ గా, ‘బిజినెస్ మెన్’ లో క్రిమినల్ లేదా మాఫియా డాన్ గా, ‘ఖలేజా’ లో టాక్సీ డ్రైవర్ గా, ‘మహర్షి’ లో స్టూడెంట్ గా..సీఈఓ గా, ‘సరిలేరు నీకెవ్వరు’ లో ఆర్మీ ఆఫీసర్ గా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన చిన్నోడుగా.. ఇలా ఆల్మోస్ట్ అన్ని రకాల పాత్రలు చేసేశాడు.

SSMB29

అలాంటప్పుడు రాజమౌళి.. మహేష్ ను డైరెక్ట్ చేయడానికి డిసైడ్ అయినప్పుడు.. ఎలాంటి పాత్రతో ఆడియన్స్ ని మెప్పించాలి అనే కన్ఫ్యూజన్ అతనికి ఉండటం సహజం. అందుకే మహేష్ బాబుతో సినిమా చేయడానికి రాజమౌళి 19 ఏళ్ళు టైం తీసుకున్నాడు.

మొత్తానికి మహేష్ బాబు కోసం ఓ మంచి పాత్ర డిజైన్ చేసుకున్నాడు. ‘ట్రెజర్ హంటర్’ రోల్లో మహేష్ బాబుని చూపించడానికి రాజమౌళి రెడీ అయ్యాడు. వీరి కాంబోలో వచ్చే సినిమాకి పురాణాల టచ్ కూడా ఉండబోతుంది. త్రేతాయుగం, ద్వాపరయుగం..కి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ ఈ సినిమాలో చిత్రీకరించబోతున్నారట. అవి వచ్చినప్పుడు మహేష్ బాబు శ్రీరాముని పాత్రలో కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. అంతేకాదు కృష్ణుడిగా కూడా కనిపించే అవకాశం ఉంది. చదువుతుంటేనే గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదూ. ఇక్కడితో అయిపోలేదు.. ఈ సినిమాలో షర్ట్ లెస్ సీక్వెన్స్ లు కూడా హీరో ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మహేష్ బాబు తన 24 ఏళ్ళ సినీ కెరీర్లో షర్ట్ లెస్ గా కనిపించింది లేదు. సో రాజమౌళితో మహేష్ ను పూర్తిగా వాడేసుకుంటాడని అర్థమవుతుంది. ఈ సినిమాలో ‘ది కంప్లీట్’ మహేష్ కనిపిస్తాడు అనడంలో సందేహం లేదు. అన్నీ ఎలా ఉన్నా శ్రీరాముని పాత్రలో మహేష్ కనిపిస్తే.. థియేటర్స్ లో రచ్చ మామూలుగా ఉండదు అనే చెప్పాలి.

18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus