శ్రీమంతుడు సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన సినిమా భరత్ అనే నేను. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని ఈనెల 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. డీవీవీ దానయ్య నిర్మించిన భరత్ అనే నేను ఈరోజు సెన్సార్ సభ్యుల ముందు వెళ్లింది. సెన్సార్ కి పంపించే ముందు చిత్రం బృందం, తమ అత్యంత సన్నిహితులు సినిమాని చూసినట్లు తెలిసింది. ఈ షో చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందని టాక్. సినిమాలో మహేష్ బాబు సరికొత్త నటనను చూడబోతున్నామని, ఆయన కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందని చెప్పుకుంటున్నారు.
రాజకీయం అంటే అసలు తెలియదని చెప్పే మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో అద్భుతంగా నటించారని అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫెయిల్ అవ్వడంతో మరింత కసిగా ఈ సినిమా చేసినట్లు టాక్. ఇక మహేష్ తర్వాత డైరక్టర్ కి ఎక్కువమార్కులు పడుతోంది. హ్యాట్రిక్ హిట్ తో దూసుకుపోతున్న కొరటాల ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారని తెలిసింది. కథ, కథనాలతో పాటు తన మాటలతో కట్టిపడేశారని… సినిమాను సెకండాఫ్‌లో చాలా ఉత్కంఠంగా ప్రజెంట్ చేశాడని చెపుతున్నారు. మరికొన్ని గంటల్లో భరత్ అనే నేను సెన్సార్ సర్టిఫికెట్ రానుంది. సెన్సార్ సభ్యుల అభిప్రాయాలూ కూడా బయటికి తెలియనుంది.