ఆకాశం నీ హ‌ద్దురా మూవీ పై.. మ‌హేష్ మైండ్‌బ్లోయిగ్ రియాక్ష‌న్..!

త‌మిళ్ స్టార్ హీరో సూర్య న‌టించిన ఆకాశం నీ హ‌ద్ద‌రా మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఎయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ద‌ర్శ‌కురాలు సుధా కొంక‌ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. దీపావ‌ళి కానుక‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పై అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. సినీ విశ్లేష‌కులు సైతం ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు ఇస్తూ, సుధా కొంగ‌ర టేకింగ్, సూర్య న‌ట‌న‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇక చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సూర్య‌కు భారీ హిట్ రావ‌డంతో ఆయ‌న అభినులు అయితే ఓ రేంజ్‌లో పండ‌గ చేసుకుంటున్నారు. బ‌యోగ్ర‌ఫిని వెండితెర పై ప్రెజెంట్ చేయ‌డం అనేది అంత తేలికైన విష‌యం కాదు. కాస్త తేడా వ‌చ్చినా, అన్ని వైపుల నుండి విమ‌ర్శ‌లు వ‌స్తాయి. అయితే గురు ఫేమ్ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర మాత్రం ఎలాంటి త‌డ‌బాటు లేకుండా, ఒక‌వైపు ప‌కడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకోవ‌డ‌మే కాకుండా, మ‌రోవైపు ద‌ర్శ‌కురాలిగా స‌క్సెస్ కొట్టారు.

అలాగే ఈ చిత్రంలో హీరోగా న‌టించిన సూర్య న‌ట‌న అయితే ఏ సీన్‌లోనూ త‌ను యాక్ట్ చేస్తున్న‌ట్టు అనిపించ‌దు. ఆ పాత్ర‌కు సంబంధించి నిజాయితీ, నిబద్ధతలను సూర్య తన కళ్లల్లోనే చూపించిన విధానం, న‌టుడిగా సూర్య‌ను మ‌రోస్థాయిలో నిలుపుతుంది. స‌రైన పాత్ర ప‌డితే, త‌న న‌ట‌న ఏ రేంజ్‌లో ఉంటుందో చూపించ‌డ‌మే కాకుండా, గ‌త ప‌రాజ‌యాలు ఓ స్టార్‌కి ఎఫెక్ట్ అవుతాయేమో కానీ, న‌టుడికి కాద‌ని సూర్య ఈ చిత్రంతో నిరూపించాడు.

 

దీంతో వెర్స‌టైల్ స్టార్ పై సామాన్య ప్రేక్ష‌కుల నుండి సినీ ప్ర‌ముఖుల నుండి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పటికే టాలీవుడ్ నుండి హీరో వెంక‌టేష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నందిని రెడ్డిల‌తో ప‌లువురు ఈ సినిమా చూసి, సూర్య న‌ట‌న, ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆకాశం నీ హ‌ద్ద‌రా టీమ్ పై స్పందించారు. ఈ మూవీలో సూర్య న‌ట‌న వేరే లెవ‌ల్‌లో ఉంద‌ని, ఈ చిత్రాన్ని సుధా కొంగ‌ర డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉందని, చివ‌రిగా ఆకాశం నీ హ‌ద్ద‌రా ఓ ఉత్తేజ‌క‌ర‌మైన చిత్ర‌మ‌ని మ‌హేష్ అన్నారు. మ‌హేష్ ట్వీట్‌కు స్పందించిన సూర్య కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus