Sitara: ప్రిన్స్ మహేష్ బాబు కూతురుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మహేష్ బాబుకి ఉన్న లేడీ ఫాలోయింగ్ ఇండస్ట్రీలో ఏ ఇతర హీరోకి కూడా లేదు అనటంలో సందేహం లేదు. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

మహేష్ బాబు హీరోయిన్ నమ్రతని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరికి గౌతమ్, సితరా అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక గౌతమ్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే గౌతమ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. కానీ మహేష్ బాబు కూతురు సితార గురించి ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయసులోనే సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎన్నో వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. అతి చిన్న వయసులోనే అత్యధిక సంఖ్యలో ఫాలోయర్స్ ని పెంచుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. సితార సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు నిమిషాలలో లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తాయి. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో ‘పెన్నీ పెన్నీ’ లిరికల్ వీడియో సాంగ్ లో సితార డాన్స్ ఇరగదీసింది.

అంతేకాకుండా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్న సితార దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. సితార ప్రతివారం రిలీజ్ అయ్యే హింది, తెలుగు, తమిళ్ ఇలా అన్ని సినిమాలు కూడా చూస్తుందట. ముఖ్యంగా టాలివుడ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు కాదట. మరి టాలీవుడ్ హీరోలలో సితార ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఈమెకు హీరో విజయ్ దేవకరకొండ సితార ఫేవరెట్ హీరో అట. అంతే కాకుండా అల్లు అర్జున్ సినిమాలు కూడా సితార ఎక్కువగా చూస్తుందని సమాచారం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus