Sitara: చిన్న వయస్సులో గొప్ప ఆలోచనలు.. సితార మనస్సుకు ఫిదా కావాల్సిందే!

మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సితార యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సితార అభిమానులను తాజాగా ఒక విషయంలో రిక్వెస్ట్ చేయగా ఆ రిక్వెస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఒక వీధికుక్కను దత్తత తీసుకోవాలని సితార రిక్వెస్ట్ చేయడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం సితారకు ఎంతో ఇష్టమైన ఫ్లూటో అనే కుక్కపిల్ల మరణించడంతో సితార ప్రస్తుతం స్నూపీ అనే కుక్కపిల్లను పెంచుకున్నారు.

ఫ్లూటో మరణంతో సితార మనస్సు ఎంతగానో బాధ పడింది. ఈ రీజన్ వల్లే సితార కుక్కపిల్లలను పెంచుకోవాలంటూ పిలుపునివ్వడం గమనార్హం. సితార ఎంతో టాలెంటెడ్ కాగా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. సితార ఇప్పటికే ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సితార రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది.

ఘట్టమనేని వంశ గౌరవాన్ని సితార పది రెట్లు పెంచుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్, సితార ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. సితార చదువుకు ప్రాధాన్యత ఇచ్చి చదువు పూర్తైన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సితార చదువులో కూడా టాపర్ అని తెలుస్తోంది.

మహేష్ బాబు సైతం సితారను (Sitara) ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. సితార కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సితార నెగిటివిటీకి దూరంగా ముందడుగులు వేస్తున్నారు. చిన్న వయస్సులోనే సితార ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus