కన్ఫ్యూషన్ లో ప్రిన్స్ అభిమానులు!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ప్రిన్స్ స్థానం ఎంతో పదిలం. అయితే అలాంటి మహేష్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు. అయితే అదే క్రమంలో ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” డిజాస్టర్ గా మిగలడంతో తన తరువాత సినిమా మురుగుదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ పాత్ర పై బిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉండడంతో  అభిమానులు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఆ సినిమాలను మొదలు పెట్టేడప్పుడే ఆసినిమా కథలో హీరో ఈవిధంగా కనిపించబోతున్నాడు అని క్లారిటీ ఇచ్చి సినిమాను మొదలు పెడుతున్నారు. కానీ ప్రిన్స్ మాత్రం ఈ సినిమా విషయంలో ఏమ్యాటర్ లీక్ కాకుండా అప్పుడే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేసాడు. అయితే ఈసినిమాకు సంబంధించి షూటింగ్ మైదలైనప్పటి నుండి అసలు మహేష్ ను ఆన్ లొకేషన్లో కనిపిస్తున్న ఫోటోలను బట్టి మహేష్ ఒక సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని గూడఛారి సంస్థ ఏజెంట్ అని వార్తలు వస్తున్నాయి….కానీ ఈ విషయమై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ దర్శకుడు మురగదాస్ ఇవ్వడం లేదు.

ఇది చాలదు అన్నట్లుగా మహేష్ పక్కన ఒక్కోసారి కత్తులు కనిపిస్తూ ఉంటే మరోసారి కొత్త కార్లకు పూజలు చేస్తూ ఆపై గుళ్ళూ గోపురాలూ మహేష్ తిరుగుతున్న మహేష్ షూటింగ్ స్పాట్ ఫోటోలను లీక్ చేస్తున్నారు. అంతేకాకుండా రకరకాలుగా లీక్ అవుతున్న ఈ ఫోటోలను చూసి మహేష్ అభిమానులు అసలు మహేష్ పాత్ర ఎలా ఉండబోతుందో…అసలు మహేష్ సీక్రెట్ ఏజెంట్ నా కాదా అన్న కన్ఫ్యూషన్ లో టెన్షన్ పడిపోతున్నారు…మరి చూద్దాం ఈ సినిమా ఫర్స్ట్ లుక్ అయిన ప్రిన్స్ పాత్రను బయటపెడుతుందేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus