స్టార్ హీరో నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్ తరువాత వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తుండగా వచ్చే నెల 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నెల 12వ తేదీన విడుదలైన వైల్డ్ డాగ్ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. హైదరాబాద్ లో జరిగిన బాంబు దాడుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అహిషోర్ సాల్మన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగార్జున సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
వైల్డ్ డాగ్ ట్రైలర్ సిద్ధమయ్యాక చిరంజీవికి ట్రైలర్ చూడమని వీడియో పంపానని ట్రైలర్ నచ్చితే ట్రైలర్ ను లాంఛ్ చేయమని చిరంజీవికి చెప్పానని నాగార్జున వెల్లడించారు. ఆ తరువాత చిరంజీవి ట్రైలర్ నచ్చినా నచ్చకపోయినా తాను నచ్చుతాను కాబట్టి ట్రైలర్ ను కచ్చితంగా లాంఛ్ చేస్తానని చెప్పాడని పేర్కొన్నారు. ట్రైలర్ చూసిన తరువాత ట్రైలర్ ఎంతో బాగుందని ప్రశంసించాడని తెలిపారు. చిరంజీవి ట్రైలర్ ను చూసిన తరువాత మహేష్ కు ట్రైలర్ ను పంపానని మహేష్ ట్రైలర్ చూసి సూపర్ అంటూ మెసేజ్ పెట్టారని తెలిపారు.
మహేష్ అనుమతితో ఆ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో షేర్ చేశానని ఆ స్క్రీన్ షాట్ లో మహేష్ డీపీని చూసిన ఫ్యాన్స్ ఎంతో సంతోషపడ్డారని నాగార్జున తెలిపారు. ప్రేక్షకులు, సినీ ప్రియుల నుంచి ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ ను చూస్తే ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున అన్నారు. అమల ట్రైలర్ ను చూసిన తరువాత ఎంతో సంతోషించిందని.. ముద్దులు, హార్ట్ ఎమోజీలను పంపించిందని నాగార్జున తెలిపారు. ఈ సినిమా యాక్షన్ సీన్ల కొరకు ఇద్దరు యాక్షన్ డైరెక్టర్లు పని చేశారని.. యాక్షన్ డైరెక్టర్లలో ఒకరైన దేవిడ్ విదేశాలకు చెందిన వారు కాగా బాలీవుడ్ కు చెందిన శ్యామ్ కౌశిక్ కూడా ఈ సినిమా కోసం పని చేశారని నాగార్జున తెలిపారు.