Mahesh, Namrata: నీ ఇష్టానికి మా మహేష్‌ని కష్టపెడతావా అంటూ ఫ్యాన్స్ సీరియస్..!

మహేష్ బాబు ఈమధ్య బ్యాక్ టు వర్క్ అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. తండ్రి మరణానంతరం ఆయన మీద ప్రేమతో అన్ని కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహింాచారు మహేష్.. జరిగిన వాటిని ఎవరూ మార్చలేరు కదా అందుకే ఆయన ఇప్పుడు తండ్రి లేరనే బాధ నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.. బాంబేలో ఓ యాడ్‌లో పాల్గొన్న మహేష్.. త్రివిక్రమ్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు.. కట్ చేస్తే.. ఇప్పటికే ఆలస్యం అవుతుంది షూట్.. మహేష్ పర్సనల్ ప్రాబ్లమ్స్.. పూజా హెగ్డే గాయం..

ఇలా చాలా కారణాలున్నాయి.. మహష్ రెడీ అయితే పూజా రూపంలో ప్రాబ్లమ్ వచ్చింది.. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. అతడు’, ‘ఖలేజా’ వచ్చిన 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఎస్. రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీలను సెకండ్ హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట.

‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’, ‘అ..ఆ’, ‘అరవింద సమేత’, ‘అల..వైకుంఠపురములో’ సినిమాల మాదిరిగానే ఇందులో కూడా ఇద్దరు ముద్దుగుమ్మలు సందడి చేయబోతున్నారు. అలాగే ఓ సీనియర్ హీరోయిన్ స్పెషల్ క్యారెక్టర్ చేయబోతుందట. ‘అత్తారింటికి’, ‘అ..ఆ’ లో నదియా.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో స్నేహా, ‘అజ్ఞాతవాసి’ లో ఖుష్బూ, ‘అల..వైకుంఠపురములో’ లో టబు లానే మహేష్ మూవీలో ఓ క్రేజీ సీనియర్ భామని దింపబోతున్నారని తెలుస్తోంది..

ఇప్పుడు పూజా కారణంగా మహేష్ ఇబ్బంది పడుతున్నాడు.. పూజా హెగ్డే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో షూట్ డిలే అవుతోంది.. దీంతో టీంతో సహా అభిమానులు కూడా ఆమె మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఇది కంప్లీట్ అయితే కానీ రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అవుతాడు మహేష్.. అదెలాగో లేట్ అవుతుంది అనుకుంటే నీ వల్ల ఇది కూడా ఇబ్బందే అంటూ పూజాని ట్రోల్ చేస్తున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus