ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మహేష్ సినిమా? ఇదిగో క్లారిటీ..!

Advertisement

మహేష్ బాబు మరో రెండు రోజుల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ మరియు మాస్ ప్రేక్షకులని విపరీతంగా అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పరశురామ్ (బుజ్జి), ప్రశాంత్ నీల్, వంశీ పైడిపల్లి.. మళ్ళీ అనిల్ రావిపూడి అంటూ చాలా పేర్లు వినిపించాయి.

ఓ దశలో కె.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఫిక్స్ అన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ దర్శకుడిని మహేష్ కలవడమే..! దీంతో వీరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటిది ఏమీ లేదని మహేష్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేసాడు. ‘ప్రశాంత్ నీల్ ను కలిసిన మాట నిజం. కలవడం వలన ఏమి జరిగిపోదు కదా. కొన్ని స్టోరీ లైన్స్ వినడం కూడా జరిగింది. అది జరిగినప్పుడు జరుగుతుంది” అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక తన తరువాతి సినిమా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చేసాడు. అయితే ఆ సినిమాకి ముందు ఓ 3 నెలలు గ్యాప్ తీసుకుంటాడట.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus