Mahesh Babu, Jr NTR: బుల్లితెరపై స్టార్ హీరోల సందడి.. ఫ్యాన్స్ కి పండగే!

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి బుల్లితెరపై సందడి చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఓ సంఘటన చోటుచేసుకోబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి బుల్లితెరపై కనిపించనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోని నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా మొదలైన ఈ గేమ్ లో తాజాగా మహేష్ బాబు సందడి చేశారు.

ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలను జోష్ గా సమాధానాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ను త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తాజాగా సదరు ప్రోగ్రామ్ టీమ్.. ఓ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేసింది. ‘పూనకాల ఎపిసోడ్ లోడింగ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటివరకు ఈ షోలో చాలా మంది స్టార్ సెలబ్రిటీలుపాల్గొన్నారు .

ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని వారంతా ఒక స్వచ్చంద సంస్థకు విరాళంగా అందించారు. రామ్ చరణ్, సమంత, రాజమౌళి, కొరటాల శివ, దేవిశ్రీప్రసాద్, తమన్ ఇలా చాలా మంది తారలు ఈ షోలో తళుక్కున మెరిశారు. ఇప్పుడు మహేష్ బాబు ఈ షోకి రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus