Mahesh Babu: జక్కన్న మూవీ గురించి క్లారిటీ ఇచ్చేసిన మహేష్!

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంచనాలకు మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి తాను సిద్ధమేనని మహేష్ బాబు చెప్పకనే చెప్పేశారు. తాజాగా మహేష్ బాబు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధమేనని క్లారిటీ ఇచ్చారు.

ఒక మీడియా ప్రతినిధి ఆర్ఆర్ఆర్ లో చరణ్, తారక్ కలిసి మల్టీస్టారర్ చేశారని మీరు వీరిలో ఎవరితో కలిసి మల్టీస్టారర్ చేస్తారని మహేష్ ను అడిగారు. ఆ ప్రశ్నకు సూపర్ స్టార్ మహేష్ బాబు సమాధానంగా ఎన్టీఆర్, చరణ్ లలో ఎవరితోనైనా మల్టీస్టారర్ చేయడానికి తాను సిద్ధమేనని చెప్పుకొచ్చారు. మహేష్ ఈ ఇద్దరిలో ఏ హీరోతో నటించినా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు.

మరో జర్నలిస్ట్ రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ నటించే సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందని వార్తలు వస్తున్నాయని ఆ వార్తలు నిజమేనా అని అడగగా బాలీవుడ్ రేంజ్, హాలీవుడ్ రేంజ్ అనే విషయం తనకు తెలియదని రాజమౌళి సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అంతకు మించి ఈ సినిమా గురించి మరేం చెప్పలేనని మహేష్ బాబు అన్నారు. మహేష్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భవిష్యత్తులో కథ నచ్చితే మహేష్ బాబు ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ బాబు ఈ మధ్య కాలంలో కథల విషయంలో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను పూర్తి చేసి మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus