Mahesh Babu: యానిమల్ ఫస్ట్ ఆప్షన్ రణబీర్ కాదా…మహేష్ బాబునా?

Advertisement

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయినటువంటి వారిలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈ సినిమాని ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఉంటున్నారు. ఇకపోతే తాజాగా ఈయన రణబీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. అయితే ఈ సినిమాలో రణబీర్ మొదటి ఛాయిస్ కాదని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ముందుగా సందీప్ రెడ్డి మహేష్ బాబుని అనుకున్నారట.

ఈ సినిమా కథతో సందీప్ రెడ్డి మహేష్ బాబు వద్దకు వెళ్లగా మహేష్ బాబు ఈ సినిమా కథ విని తన సినిమా కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాలని ఫిక్స్ అయ్యారు కానీ నమ్రత మాత్రం ఈ సినిమా కథ వద్దని మహేష్ బాబుకి చెప్పారట. నమ్రత వద్దని చెప్పడంతోనే మహేష్ బాబు ఈ సినిమాకి నో చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమా కథ విన్నటువంటి నమ్రత ఈ సినిమా వద్దు కానీ మరొక మంచి కథతో రండి సినిమా తప్పకుండా చేద్దామని చెప్పారట.

ఈ విధంగా (Mahesh Babu) మహేష్ బాబు నో చెప్పడంతోనే సందీప్ రెడ్డి రణబీర్ వద్దకు ఈ కథను తీసుకెళ్లడం ఆయన ఈ సినిమాకు ఒప్పుకోవడం జరిగింది. అయితే మహేష్ బాబు సినిమాల విషయంలో నమ్రత ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. సినిమాల విషయంలో నమ్రత ఏం చెబితే మహేష్ బాబు అది చేస్తారనీ ఆయన సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరంటూ వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా నమ్రత చెప్పిన విధంగానే ఈయన యానిమల్ సినిమా రిజెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus