Mahesh Babu, Rajamouli: సూపర్ స్టార్ ప్లాన్ వర్కవుట్ అవ్వదేమో!

  • August 16, 2021 / 12:50 PM IST

దర్శకుడు రాజమౌళితో సినిమా అంటే అది ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. ఆయన సినిమాల్లో నటించే హీరోలు కనీసం రెండేళ్ల వరకు తమ కాల్షీట్స్ ను రాజమౌళికి ఇచ్చేయాలి. అంటే రెండు, మూడేళ్ల వరకు మరో సినిమా చేసే అవకాశం ఉండదు. ప్రభాస్ అయితే ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు సమయం కేటాయించాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. ఇప్పుడు మహేష్ బాబుకి ఇదే భయం పట్టుకుంది.

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కే మొదటి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకే ఆ సినిమా మొదలుపెట్టేలోపు కనీసం మూడు సినిమాలు చేయాలని ప్లాన్ వేసుకున్నాడు మహేష్ బాబు. అయితే కరోనా కారణంగా తన ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. దీంతో మహేష్ అనుకున్నట్టుగా మూడు సినిమా చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. 2022 మే లోపు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ తరువాత రాజమౌళి సినిమా కోసం మేకోవర్ చేయాలి. ఇలా చూస్తే మహేష్ కి మరో సినిమా చేసే ఛాన్స్ దొరకడం లేదు. రాజమౌళి సినిమా వచ్చే ఏడాది మొదలైతే.. అది 2024లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus