మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా అంటే ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది. సరైన విధంగా ఈ సినిమాని ప్రమోట్ చేసి.. రిలీజ్ చేయకపోవడమే.. ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అని అంతా భావించారు. అయితే అలా ప్రమోట్ చేయకపోవడానికి గల కారణాన్ని కూడా నిర్మాత అనిల్ సుంకర ఇటీవల ఓ సందర్భంలో బయటపెట్టారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ…” ‘1 నేనొక్కడినే’ సినిమా టైంలో ట్రైలర్ లాంచ్ వంటివి లేవు. కానీ ఆ సినిమాకి ట్రైలర్ లాంచ్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాం. ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటి, హీరో రోల్ ఎలా ఉంటుంది అనేదానిపై ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ట్రైలర్ లాంచ్ ఏర్పాటు చేశాం. ఫ్యాన్స్ అంతా హీరోతో(మహేష్ బాబు) ఇంటరాక్ట్ అయినట్టు కూడా ఉంటుంది అని పాసెస్ వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం.
కానీ మేము స్టేజి ఎక్కే టైంకి.. మాకు డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఇండస్ట్రీ పెద్దల నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ట్రైలర్ కనుక చూపిస్తే.. ‘ఓపెనింగ్స్ రావు’ అని అన్నారు. దీంతో మాకు భయం వేసింది. వెంటనే ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాం. ‘దూకుడు’ హైప్ తోనే ఓపెనింగ్ కొట్టి.. కలెక్షన్స్ తెచ్చుకుందాం అని భావించాం. కానీ సినిమాకి వచ్చిన ఫ్యాన్స్, ఆడియన్స్.. అందులో హీరోకి జబ్బు ఉందని తెలిసి డిజప్పాయింట్ అయిపోయారు.
ఒకవేళ మేము ముందు అనుకున్నది చేసి ఉంటే.. వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేవారు. ఫలితం మరోలా ఉండేదేమో” అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.