Mahesh Babu, Rajamouli Movie: ఆ తేదీనే నమ్ముకున్న సూపర్ స్టార్!

  • August 12, 2021 / 02:10 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించనున్నారు.

2022 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ నుంచి మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి2 సినిమా ఏప్రిల్ 28వ తేదీన రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందువల్ల ఆ తేదీనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని మహేష్ బాబు, రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే లాంఛింగ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.

మహేష్, రాజమౌళి మధ్య ఇప్పటికే కథ గురించి చర్చలు జరిగినట్టు సమాచారం. 2024 సంవత్సరంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus