‘మురుగుదాస్’ పై మహేష్ సీరియస్!!!

టాలీవుడ్ టాప్ హీరో ప్రిన్స్, మహేష్ బాబు, బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఇప్పుడెప్పుడే కోలుకుంటున్నాడు. అయితే ఇదే క్రమంలో త్వరలో తమిళ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మురుగుదాస్ చెప్పిన కధ బాగా నచ్చడంతో, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి త్వరలో షూటింగ్ లో పాల్గొనడానికి ప్లాన్ లో ఉన్నాడు ప్రిన్స్.

అయితే ఇదే క్రమంలో సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఒక వార్త ప్రిన్స్ కు దర్శకుడు మురుగుదాస్ పై కోపం తెప్పించేలా చేసింది..ఇంతకీ ఏంటి ఆ వార్త అంటే…తాజాగా మురుగదాస్ తన మూవీకి సంబంధించిన కథని ఓ వ్యక్తితో పూర్తిగా చెప్పాడంట. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ కథకి సంబంధించిన కొన్ని కీలక సీన్స్ ని లీక్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిస్తున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రముఖ దర్శకుడు, ఈ సినిమాలో విలన్ పాత్రదారి యస్.జె.సూర్య. సూర్య చేస్తున్నది విలన్ రోల్ కావడం, మరోపక్క తాను కూడా దర్శకుడు కావడంతో మహేష్ బాబుతో చేసే కథని పూర్తిగా సూర్యకి చెప్పాడు మురుగదాస్.

అయితే సూర్య మాత్రం ఆ కథలోని కొన్ని కీలక సన్నివేశాలని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లీక్ చేశాడు. ఇక ఈ విషయం తెలిసిన ప్రిన్స్ దర్శకుడిపై కోపంగా ఉన్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ లీక్ అయిన సీన్స్ ను మార్చే పనిలో పడ్డాడు మన మురుగుదాస్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus