Mahesh Babu: డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్న మహేష్..!

  • June 19, 2021 / 10:06 AM IST

అవును మహేష్ బాబు డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నాడట. కంగారు పడి ఏ సినిమాలో అని అడగకండి…ఎందుకంటే మహేష్ డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నది రీల్ లో కాదు రియల్ లైఫ్ లో..! మేటర్లోకి వెళ్తే.. కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. నిర్మాతల పై వడ్డీ రేట్ల భారం ఎక్కువయ్యింది. ఈ నేపథ్యంలో షూటింగ్లు ఎప్పటి నుండీ ఎప్పటి వరకు జరుగుతాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి.

కాబట్టి ఇదివరకటిలా హీరోల డేట్ల కోసం వాళ్ళు ఎదురుచూసే పరిస్థితి కాదు. హీరోలే తమ డేట్లు అడ్జస్ట్ చేసుకుని దిగి రావాలి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. వాళ్ళు ఒకేసారి రెండేసి సినిమాల్లో నటిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒకటి పూర్తయ్యాక మరొకటి అనే పద్ధతిని ఫాలో అవుతారు. కానీ ఈసారి తప్పడం లేదు. ఇప్పుడు మహేష్ కూడా ఒకేసారి రెండు సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం ఆయన పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ , త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి ఈ రెండు సినిమాల షూటింగ్ లలో ప్యారలల్ గా పాల్గొంటాడని తెలుస్తుంది.ముందుగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తాడు మహేష్. అక్కడ ఓ షెడ్యూల్ పూర్తి చేసాక.. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇలా చేయడం వలన 2022 లోపు రెండు సినిమాలను విడుదల చేసి రాజమౌళి మూవీకి రెడీ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus