పరుశురామ్ మూవీ కోసం కొత్త లుక్ ట్రై చేయనున్న మహేష్

  • May 5, 2020 / 04:57 PM IST

ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ స్టార్ ఎవరైనా కొత్తగా ట్రై చేయకపోతే రిసీవ్ చేసుకోవడం లేదు. ట్రెండ్ కి తగ్గట్టుగా హీరోలు మారాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. బాలీవుడ్ లో ఐదు పదులు దాటేసిన హీరోలు కూడా సిక్స్ ప్యాక్ లు నయా లుక్ లు ట్రై చేస్తున్నారు. వారితో పోల్చుకుంటే మన హీరోలు కొంచెం వెనుకనే అని చెప్పాలి. సిక్స్ ప్యాక్ బాడీల సంగతి అటుంచితే కనీసం కొత్త లుక్స్ ట్రై చేయక పోతే వీరాభిమానుల నుండే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి సాధ్యమైనంత వరకు టాలీవుడ్ దర్శకులు, హీరోలు దీనిపై శ్రద్ద పెడుతున్నారు. ఐతే హీరో మహేష్ కొన్నాళ్లుగా తన లుక్ విషయంలో ఎటువంటి మార్పులు చేయడం లేదు. ఆయన కొంచెం జుట్టు పెంచడం, తగ్గించడం మినహాయించి ఒకే లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన లుక్ లో మొనాటమి ఎక్కువ అయ్యింది అన్న విమర్శలు ఎక్కువై పోయాయి. ఈ నేపథ్యంలో ఆయన తన నెక్స్ట్ మూవీ కోసం ఓ డిఫరెంట్ లుక్ ట్రై చేసే ఆలోచనలో ఉన్నారట.

దర్శకుడు పరుశురాం తో ఆయన తన నెక్స్ట్ మూవీ చేస్తుండగా, పరుశురాం కి సూచనలు చేయడం కూడా జరిగిందట. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా ఓ ట్రెండీ లుక్ మహేష్ కోసం సిద్ధం చేసే పనిలో పరుశురాం ఉన్నారట. మహేష్ మేకోవర్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇక పరుశురాం మహేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నాడని సమాచారం. మే 31న మహేష్ తండ్రి గారైన కృష్ణ పుట్టిన రోజు కానుక ఈ కొత్త మూవీ ప్రకటన రానుంది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus