SSMB28: సంతోషంలో మహేష్ ఫ్యాన్స్.. కారణమిదే..?

  • May 4, 2021 / 12:42 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తరువాత మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు పార్థు అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అతడు సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు పార్థు అనే సంగతి తెలిసిందే.

ఆ పేరునే సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేసినట్టు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే టైటిల్ కు సంబంధించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహేష్ త్రివిక్రమ్ ఈ టైటిల్ నే ఫైనల్ చేస్తారో లేక మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి పని చేయబోతున్నారు . హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

2021 సంవత్సరం మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందని 2022 సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. మరోవైపు కరోనా విజృంభణ వల్ల మహేష్ బాబు ఫ్యాన్స్ కోరిక తీరుతోంది. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలు ఏడాదికి ఒకటి మాత్రమే రిలీజవుతున్నాయి. అయితే వచ్చే ఏడాది మాత్రం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాతో పాటు మహేష్ త్రివిక్రమ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. కరోనా వల్ల మహేష్ బాబు సినిమాలు ఒకే ఏడాదికి రెండు రిలీజ్ కావాలన్న ఫ్యాన్స్ కోరిక మాత్రం తీరనుంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus