Mahesh Babu: త్రివిక్రమ్ మహేష్ మూవీ స్టోరీ లైన్ ఇదేనా..?

గత కొన్ని రోజుల నుంచి మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ప్రకటన నిన్న వెలువడింది. 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా ఫ్లాప్ కావడంతో ఆ సినిమా తరువాత కొన్నేళ్ల పాటు మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తెరపైకి రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో అజ్ఞాతవాసి మినహా మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కావడంతో మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపారు. అయితే ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో మహేష్ సీక్రెట్ ఏజెంట్, జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నారని సమాచారం. అయితే రాజమౌళి కూడా ఇదే తరహా కథతో మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది.

స్క్రిప్ట్ లైన్ ఒకే విధంగా ఉండటంతో రాజమౌళి మహేష్ కోసం తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కొత్త స్క్రిప్ట్ ను సిద్ధం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. మహేష్ బాబు ఒకవైపు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉంటాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus