సందేశాత్మక చిత్రంలో హీరోలుగా మహేష్ .. విజయ్ .. యష్..?

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ భాషలోనైనా సరే.. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఉండే ఆదరణే… వేరు. ప్లాపుల్లో ఉన్న చాలా మంది హీరోలు సందేశాత్మక చిత్రాలు చేస్తే హిట్ వస్తుందనే సెంటిమెంట్ ఎప్పుడూ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. ఆ ఫీవర్ ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్లు వచ్చినప్పుడు ‘శ్రీమంతుడు’ అనే మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు… అంతేకాదు ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి డిజాస్టర్లున్నప్పుడు కూడా ‘భరత్ అనే నేను’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘కత్తి’ ‘మెర్సెల్’ ‘సర్కార్’ వంటి చిత్రాలతో హిట్టందుకున్నాడు.

ఇలా తెలుగు,తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ మధ్య సందేశాత్మక చిత్రాలు కూడా ఎక్కువగానే రూపొందుతుండడం విశేషం. ఇక తాజాగా మరో సందేశాత్మక కథ సిద్ధమైంది. దేశంలోని ప్రధానమైన సమస్యలలో ఒకటైన పశువుల అక్రమ రవాణా చేసే మాఫియాపై రచయిత్రి సుచిత్రరావు ఒక పుస్తకం రాసింది. ‘ది హైవే మాఫియా’ పేరుతో గత ఏడాది ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఇక ఈ కథను వివిధ భాషల్లో సినిమాగా తెరకెక్కిస్తే.. బాగుంటుందనే ఉద్దేశంతో ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తుందట. ఇప్పటికే బడా నిర్మాణ సంస్థలతోను .. దర్శకులతోను సంప్రదింపులు జరిపిందట. ఇది ఒక హైవే మాఫియా పై సున్నితంగా కనిపించే బలమైన కథాంశంమని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పలు భాషల్లో తెరేక్కించబోయే ఈ చిత్రంలో.. ప్రధాన పాత్రకు హిందీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. తెలుగులో మహేష్ బాబు .. తమిళంలో విజయ్ .. కన్నడలో యశ్ సరిగ్గా సరిపోతారని ఆమె చెప్పుకొస్తుంది. మరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆమె ప్రయత్నం ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus