Namrata: ఆ ఫోటోలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న నమ్రత.. ఏం జరిగిందంటే?

  • September 27, 2023 / 06:37 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నమ్రత వయస్సు 51 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. వయస్సులో నమ్రత మహేష్ బాబు కంటే పెద్ద కావడం గమనార్హం. అయితే మహేష్ బాబు భార్య లేటెస్ట్ ఫోటోలను చూస్తే ఆమె వయస్సు తగ్గుతోందా అని అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేటెస్ట్ ఫోటోలలో నమ్రత అదుర్స్ అనే లుక్ తో ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నారు.

మహేష్ బాబు నమ్రత (Namrata) కాంబినేషన్ లో వంశీ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నారు. మహేష్ బాబు నమ్రత కలిసి ఒక సినిమాలో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నమ్రత మాత్రం తాను సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే లేదని వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

గౌతమ్, సితార కూడా రాబోయే రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గౌతమ్, సితార సినిమాలపై ఆసక్తి ఉందని పలు సందర్బాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రాజమౌళి సినిమాల స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని నిర్మాత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీలీల ఒక హీరోయిన్ గా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 225 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గుంటూరు కారం సక్సెస్ ఈ సినిమా కోసం పని చేస్తున్న ఎంతోమందికి కీలకమని చెప్పవచ్చు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus