Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో డిజాస్టర్ సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో ‘అతిథి'(Athidhi) సినిమా కచ్చితంగా ఉంటుంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ ఇది.

Athidhi

టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ‘పోకిరి’ తర్వాత మహేష్ బాబు రేంజ్ మారిపోయింది..! ఆయన ఒక సూపర్ స్టార్ గా అవతరించాడు. అయితే ‘పోకిరి’ తర్వాత వచ్చిన ‘సైనికుడు’ పెద్ద డిజాస్టర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కానీ టెక్నికల్ గా చూస్తే.. ‘పోకిరి’ కంటే ముందే ‘సైనికుడు’ షూటింగ్ మొదలైంది. కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అవ్వడంతో రిలీజ్ లేట్ అయ్యింది.ఆ రకంగా చూస్తే.. ‘పోకిరి’ సృష్టించిన ప్రభంజనం తర్వాత మహేష్ బాబు పూర్తి నమ్మకంతో సైన్ చేసి నటించిన సినిమా ‘అతిథి’ అనే చెప్పాలి. సొంత బ్యానర్లో రమేష్ బాబు నిర్మించిన సినిమా ఇది. 2007 అక్టోబర్ 18న భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.

మొదటి ఆటతోనే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ‘పోకిరి’ తెచ్చిన క్రేజ్ వల్ల సినిమాకి మొదటి వారం భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ రోజుల్లోనే ‘అతిథి’ సినిమాను బయ్యర్స్ పోటీపడి మరీ దాదాపు రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫుల్ రన్‌లో కేవలం రూ. 19 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి, బయ్యర్లకు రూ.6 కోట్ల నష్టాలను మిగిల్చింది.కమర్షియల్ గా చూస్తే ఇది మరీ తీసిపారేసే వసూళ్లు కాకపోయినా.. కంటెంట్, స్క్రీన్‌ప్లే మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా డిజప్పాయింట్ చేశాయి.

హెవీ వయలెన్స్ వల్ల కనీసం మహేష్ బాబు అభిమానులు కూడా ‘అతిథి’ని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయారు అనేది వాస్తవం.అలాంటి ఓ ఫ్లాప్ సినిమాను దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ రీ-రిలీజ్ చేశారు. వినడానికి కొంచెం వింతగా అనిపించినా ఇది నిజం. సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతి మే 31న ఉండటంతో… ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తెచ్చారు.ఇది నార్మల్ రీ-రిలీజ్ కాదు! ఈసారి సరికొత్త 4K అల్ట్రా హెచ్‌డీ వెర్షన్ లో సినిమాను రెడీ చేశారు.

దానికి తోడు, ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో కొన్ని సీన్లకు కొత్తగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చేయించి మరీ హడావిడి చేశారు.ఒక డిజాస్టర్ సినిమాకి ఇంత హడావిడి అవసరమా అని అందరూ అనుకున్నాడు. అందుకు తగ్గట్టే ‘అతిథి’ రీ-రిలీజ్ మహేష్ బాబు మునుపటి రీ-రిలీజ్ సినిమాలు (‘ఖలేజా’ ‘పోకిరి’ ‘మురారి’ ‘ఒక్కడు’ ‘బిజినెస్మెన్’) చేసినంత అద్భుతాలు చేయలేకపోయింది. మే 29న రీ-రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.25 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది.

నెగటివ్ టాక్ ఉన్న సినిమా కావడంతో ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని థియేటర్లలో మళ్లీ చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే ఓపెనింగ్స్ ఇలా వచ్చాయి. అయితే, ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లేకుండా, ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా, ఒక ఫ్లాప్ సినిమాకి ఈ రోజుల్లో రూ.1 కోటి మార్క్ గ్రాస్ ఓపెనింగ్ రావడం కూడా చిన్న విషయం కాదు.మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినాకి దీనిని నిదర్శనంగా చెప్పుకోవాలి.

‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus