Guntur Kaaram: ఆ థియేటర్లో 200 రోజులు ఆడిన ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) .. కలయికలో ‘అతడు’ (Athadu)  ‘ఖలేజా’ (Khaleja) వంటి చిత్రాల తర్వాత భారీ అంచనాల నడుమ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అనే సినిమా వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ మహేష్ బాబుకి,  త్రివిక్రమ్..కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్, పైగా సంక్రాంతి పండుగ సెలవులు వంటివి కలిసొచ్చి భారీ ఓపెనింగ్స్ ని సాధించింది ఈ మూవీ.

కొన్ని ఏరియాల్లో అయితే సంక్రాంతి సెలవులు ముగిశాక కూడా నిలదొక్కుకుని మొత్తానికి రూ.110 కోట్ల షేర్ ను సాధించింది. మహేష్ బాబు ఈ విషయంలో పెద్ద రికార్డు కొట్టాడు అనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ లో(ఓటీటీలో) రిలీజ్ అయినప్పుడు కూడా 2 వారాల పాటు నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యింది ‘గుంటూరు కారం’. మరోపక్క జెమినీ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు కూడా 9 కి పైగా టీఆర్పీ రేటింగ్ ను సాధించి పర్వాలేదు అనిపించింది.

మరోపక్క 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ‘గుంటూరు కారం’ సినిమా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడులో ఉన్న చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్లో 200 రోజులు(రోజుకి 4 ఆటలుగా) ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది. ఈ రోజుల్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమాలు 2 వారాలు థియేటర్లలో నిలబడటమే కష్టంగా ఉంది. అలాంటిది ‘గుంటూరు కారం’ సినిమా 200 రోజులు ఆడింది అంటే మామూలు విషయం కాదు. మహేష్ బాబుకు ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus