సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘స్పైడర్‌’ సెన్సార్‌ పూర్తి!

  • September 18, 2017 / 10:14 AM IST

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని సింగిల్‌ కట్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్‌ జయరాజ్‌ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌ సక్సెస్‌ అయింది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘స్పైడర్‌’ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నారు దర్శకనిర్మాతలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus