సంచలనం…ప్రిన్స్ పేరుతో…ఘరానా మోసం!

టాలీవుడ్ లో ప్రతీ హీరోకి తనదైన శైలిలో అభిమానులు ఉంటారు. అయితే కొందరు తమ అభిమాన హీరోని చూడాలి అనుకుంటారు. మరికొందరు తమ అభిమాన హీరోతో ఫోటో దిగాలి అని ఆశ పడతారు. ఇంకొందరు తమలో టాలెంట్ ఉండాలే కానీ, తనకు నచ్చిన హీరోతో సినిమానో తీయాలనో, లేకపోతే కధ డైలాగ్స్ రాయలనో, ఇంకా వీలుకాకపోతే కనీసం ఒక పాట అయితే రాసి తమ అభిమానాన్ని చూపించాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు. అయితే అలాంటి ఒక అభిమాని తాపత్రయాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకున్నాడు ఒక ఫేస్‌బుక్ దొంగ…విషయం ఏమిటంటే…మెహబూబ్ నగర్ కు చెందిన ప్రేమ్ రాజ్ పాటలు కథలు బాగా వ్రాస్తాడు. మహేష్ వీరాభిమాని  అయిన ప్రేమ్ రాజ్ ఏదోవిధంగా మహేష్ ను కలిసి తన పాటలు కథలు వినిపించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.

అదే క్రమంలో ప్రేమ్ రాజ్ కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు శశి. తాను మహేష్ కు బాగా క్లోస్ అని, అంతేకాకుండా మహేష్ మ్యానేజర్, తాను మంచి స్నేహితులం అని చెప్పడంతో మన ప్రేమ్ రాజ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇక తాను రాసిని పాటలను ప్రిన్స్ కి చూపించాలి అన్న ఆతురతతో హైదరాబాద్ వెళ్ళి శశిని కలసి కొంత డబ్బును సమర్పించుకున్నట్లు తెలుస్తుంది. అయితే తాను మోసం పోయినట్లు గ్రహించిన ప్రేమ్ రాజ్, తనలా ఎవరూ మోసపోకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ ఘరానా మోసం బయట పెట్టడానికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. సంచలనం కలిగిస్తున్న ఈ కంప్లైంట్ ను రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ప్రేమ్ రాజ్ లా ఇలా శశి చేత మోసపోయిన బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారో అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం అటు తిరిగి….ఇటు తిరిగి ప్రిన్స్ కు చేరడంతో ప్రిన్స్ ఓక్క్సారిగా ఉలిక్కి పడినట్లు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus