అమెరికాలో ఫ్యాన్స్ నిర్వహించనున్న భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక

డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న రెండో మూవీ భరత్ అను నేను.  శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం నేడు సెన్సార్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమాకి కొన్ని రోజుల క్రితం  ప్రీ రిలీజ్ వేడుకను ఎల్బీ స్టేడియంలో  గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై మంచి సంస్కృతిని పునః ప్రారంభించారు. ఇప్పుడు అభిమానులు మరోసారి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కాన్సాస్ సిటీ (అమెరికా) లో ఈనెల 18 న ఎస్ క్లబ్ వాళ్ళు ఈ వేడుకను జరపడానికి అన్ని పనులు పూర్తిచేశారు.

ఈ కార్యక్రమంలో భరత్ అనే నేను చిత్ర యూనిట్ ఎంతమంది పాల్గొంటారో అనేది ఇంకా వెల్లడించలేదు.  మనదేశంలో ఏప్రిల్ 20 న  భరత్ అనే నేను రిలీజ్ అవుతుండగా..   అమెరికాలో ఒకరోజు ముందుగా అంటే 19వ తేదీ రాత్రి సుమారు 2000 ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు. ఈ భారీస్థాయి షోల వలన రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్  వస్తాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య  నిర్మించిన ఈ సినిమా భారీ కలక్షన్స్  తో పాటు సమాజంలో మార్పుకు దోహదం చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus