వచ్చే ఏడాది నుంచి పాలసీ అమలు చేయనున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి స్పీడ్ పెంచనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక చిత్రం విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఒకే సమయంలో రెండు చిత్రాల్లో నటించేందుకు సై అంటున్నారు. ప్రస్తుతం కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో  ప్రిన్స్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ చిత్రీకరణ డిసెంబర్ కి పూర్తి అవుతుంది.

జనవరి నుంచి కొరటాల శివ తో మహేష్ మూవీ మొదలు కాబోతోంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే ప్రిన్స్ మరో చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. రెండో మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  డైరక్ట్ చేయనున్నారు. ఇక వచ్చే ఏడాది సూపర్ స్టార్ చేయనున్న మూడో సినిమా కూడా ఖరారు అయింది.  స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి జనగనమన కోసం పనిచేయనున్నారు. ఈ మూడు ప్రాజక్ట్ లో ఏదైనా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటే.. అప్షనల్ గా వంశీ పైడిపల్లి స్టోరీని హోల్డ్ లో పెట్టారు. ఇదే ప్లాన్ తో ముందుకెళ్తే  ప్రతి సీజన్లో మహేష్ అభిమానులకు పండుగే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus