మహేష్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లో కాదన్న నిర్మాతలు
- January 24, 2017 / 10:42 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోని రోడ్లపై రాత్రివేళల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈనెల 9 నుంచి మొదలయిన ఈ షెడ్యూల్ 29 వరకు కొనసాగనుంది. ఇక్కడ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం బ్యాంకాక్ కి వెళ్లనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇందులో నిజం లేదని నిర్మాతలు ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారం ముంబైకి వెళుతామని వెల్లడించారు. ఫిబ్రవరి 10 నుంచి ముంబై, పూణే లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు వివరించారు.
ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ లో ప్రిన్స్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆయన లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈనెల 26 న ఈ చిత్రం లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేయాలని మురుగదాస్ బృందం భావిస్తోంది. డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













