’24’ సినిమాను వీళ్ళే కాదనుకున్నారు???

టాలీవుడ్ పరిశ్రమలో టాప్ హీరోల్లో ఆ ఇద్దరి పేరే ఎక్కువగా వినిపిస్తుంది..వారెవరో ఇప్పటికీ మీకు అర్ధం అయిపోయి ఉండాలి…ఒకరి ప్రిన్స్ మహేష్ బాబు కాగా..మరొకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు టాలీవుడ్ టాప్ పొసిషన్ కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే…తాజాగా వీళ్ళిద్దరికీ సంభందించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తుంది…ఇంతకీ ఏంటి ఆ వార్త?? అంటే…గత వారం విడుదలయిన….సూర్య..”24″ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకు పోతుంది, అయితే ఈ సినిమాను ముందుగా మహేష్ కు వివరించాడు దర్శకుడు అయితే…ఈ విన్న మహేష్ సున్నితంగా…తన ఫేస్ ఓల్డ్ గెటప్ కు అంతగా సూట్ కాదని, పైగా విలనిజం తన ఫేస్ లో పండదేమో అని తిరస్కరించాడు…

ఇక పవన్ వద్దకు వెళ్ళిన ఈ కధ పవన్ కు ఏకంగా నిద్ర వచ్చేలా చేసింది అని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వాదన. ఇదిలా ఉంటే అటు తిరిగి..ఇటు తిరిగి ఈ సినిమా సూర్య వద్దకు వెళ్ళడం..ఆయన కధను నమ్మి సొంత నిర్మాణంలో ఈ సినిమాను తీయ్యడం మరో పక్క ఈ సినిమా భారీ హిట్ గా నిలవడం చక..చకా.. జరిగిపోయాయి. అయితే ఈ కధ వినే సమయంలో పవన్ కల్యాణ్ కు నిద్ర ఎందుకు వచ్చిందో అన్న మాట పక్కన పెడితే…ఈ సినిమా మహేష్ చేసి ఉంటే…వాచ్ మేకర్ పాత్రకు భలే జోష్ వచ్చి వుండేది అన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తుంది…కాకపోతే, ఆత్రేయ క్యారెక్టర్ వేస్ట్ అయిపోయేది. ఏది ఏమైనా..ఎంత ప్రయోగాత్మక చిత్రం అయినా…మొత్తానికి మన తమిళ సూపర్ స్టార్ సూర్య..పుణ్యమా అని…ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus