సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి తమిళంలో స్ట్రైట్ మూవీ చేస్తున్నారు. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న ద్వి భాష చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో జెండా పాతేయాలని మహేష్ ప్లాన్ వేస్తున్నారు. అందుకే జల్లికట్టు పోరాటానికి మద్దతు తెలిపి తమిళీయుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇదే పద్ధతిలో తాను బాగా ప్రాచుర్యం పొందాలని ఓ ప్లాన్ వేసి తప్పుచేసారు. అదే తన మొదటి సినిమా రాజకుమారుడుని తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేయడం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ‘తునిచల కారన్’ అనే పేరుతో జనవరి 27 న విడుదల అయింది. పదిహేడేళ్ల క్రితం తెరకెక్కిన ఈ ఫిల్మ్ తమిళ ప్రజలను ఆకట్టుకుంటుందని , దీని ద్వారా తమ స్ట్రైట్ మూవీకి ఓపెనింగ్స్ పెరుగుతుందని భావించారు. కానీ ప్లాన్ బెడిసికొట్టింది.
ఈ మూవీ ప్రదర్శించిన హాల్స్ మొదటి రోజు కూడా హౌస్ ఫుల్ కాలేదంట. దీంతో ఈ చిత్రాన్ని వీకెండ్స్ థియేటర్లలో ఉంచి తీసేసినట్లు సమాచారం. ప్రిన్స్ గత చిత్రాలు దూకుడు, 1 నేనొక్కడినే తమిళంలోకి అనువాదం అయి మంచి కలక్షన్స్ సాధించాయి. రాజకుమారుడు ఆదరణ పొందలేదు. ఇప్పుడు ఈ చిత్రానికి అనువాదానికి అనుమతి ఇచ్చి మహేష్ తప్పు చేశారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీని ప్రభావం స్ట్రైట్ చిత్రంపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.