నటసింహ నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి శాతవాహనుల కాలం నాటి కథను ఎంచుకొని సాహసం చేశారు. ఒకటవ శతాబ్దం నాటి కథను ఇరవై ఒకటో శతాబ్ద ప్రజలకు నచ్చేలా క్రిష్ శ్రమించారు. వారి సాహసం, శ్రమ వృథా పోలేదు. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ టీమ్ మొత్తాన్ని అభినందనలతో ముంచె త్తుతున్నారు. నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ శాతకర్ణిగా బాబాయ్ నటన అద్భుతమని కీర్తించారు. మెగా హీరోలు సైతం మెచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చిత్రాన్ని చూసిన వెంటనే స్పందించారు.
“గౌతమి పుత్ర శాతకర్ణి చేసినందుకు హ్యాట్సాఫ్ నందమూరి బాలకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన చిత్రాల్లో ఇదొక ఆణిముత్యం” అంటూ ప్రిన్స్ ట్వీట్ చేశారు. శాతకర్ణి తల్లి గౌతమిగా హేమమాలిని, వసిష్ఠ దేవిగా శ్రీయా నటన ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి. చిరంతన్ బట్ సంగీతం సినిమాకు వెన్నుగా నిలిచాయి. సాయి మాధవ్ పదునైన మాటలు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సొగసైన సాహిత్యం.. ఇలా ప్రతి అంశం సరిగ్గా మిళితం కావడంతో అద్భుత దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది . అందుకేఈ మూవీ అవలీలగా వందకోట్ల క్లబ్ లో జాయిన్ అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.