సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర భాషా పరిశ్రమల వైపు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తెలుగుపైనే ఫోకస్ పెట్టారు. అందుకే తెలుగు ప్రజలకు నచ్చే కథలనే ఎంచుకునే వారు. ఆ చిత్రాలు ఇక్కడ సూపర్ హిట్ అయినప్పటికీ తమిళం, మలయాళంలో పెద్దగా ఆడేది కాదు. మహేష్ ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. అందుకే కోలీవుడ్ లో టాప్ డైరక్టర్ లో ఒకరైన ఏఆర్ మురుగదాస్ తో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ థియేటర్స్ హక్కులు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే పలుకుతున్నాయి. కానీ తమిళనాడులో స్పైడర్ థియేటర్స్ హక్కుల కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ తక్కువగా కోట్ చేస్తున్నారు.
కేవలం ఇరవై కోట్లు మాత్రమే ఇస్తామని ముందుకు వస్తున్నారు. దీంతో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ కి ఏమి చేయాలో తోచడం లేదు. వంద కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంత తక్కువ ధర లభిస్తుండడం నమ్మలేకపొతున్నారు. మహేష్ గత చిత్రాల విషయంలో ప్రచారం బాగా చేసి ఉంటే.. అతని వ్యాల్యూ పెరిగేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్పైడర్ పాటలు, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ధరల్లో మార్పు రావచ్చని చిత్ర బృందం భావిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.