Jr NTR: ఎన్టీఆర్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన మహేష్ విట్టా!

  • October 10, 2022 / 10:53 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. గత కొంతకాలంగా తారక్ షూటింగ్ లకు దూరంగా ఉన్నా తారక్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ విట్టా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన మహేష్ విట్టా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ అంటే నాకు చాలా ఇష్టమని తారక్ గురించి మ్యాగ్జిమమ్ అప్ డేట్స్ తెలుసుకుంటూ ఉంటానని అన్నారు.

తారక్ గురించి ఎవరేం చెప్పినా నేను వింటూనే ఉంటానని మహేష్ విట్టా పేర్కొన్నారు. నైట్ ఎంత ఆలస్యమైనా తారక్ ఉదయం కరెక్ట్ టైమ్ కు షూట్ కు వెళతారని మహేష్ విట్టా చెప్పుకొచ్చారు.ఆయనకు ఫుడ్ తినాలనిపిస్తే ఏ ఫుడ్ అయినా తింటారని మహేష్ విట్టా వెల్లడించారు. క్యారెక్టర్ కోసం మారాలంటే ఎంత కష్టమైనా మారిపోతారని మహేష్ విట్టా చెప్పుకొచ్చారు. తారక్ కు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని మహేష్ విట్టా పేర్కొన్నారు.

తారక్ కొంతకాలం ఓల్డ్ సిటీలో ఉన్నారని ఓల్డ్ సిటీ ఉర్దూ స్లాంగ్ ను తారక్ బాగా మాట్లాడతారని మరే స్టార్ హీరోలో ఆ టాలెంట్ లేదని మహేష్ విట్టా చెప్పుకొచ్చారు. అలాంటి పాత్ర తారక్ కు పడితే తారక్ ఊహించని రేంజ్ లో మెప్పిస్తారని మహేష్ విట్టా అన్నారు. మహేష్ విట్టా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నా పక్కన ఎప్పుడూ జనాలు ఉండాలని కోరుకుంటానని నాకు నీట్ నెస్ ఎక్కువని ఆయన పేర్కొన్నారు. నేను ప్యూర్ ఫ్యామిలీ మేన్ అని మహేష్ విట్టా తెలిపారు. నా జీవితంలో ఏం జరిగినా అమ్మకు చెబుతానని మహేష్ విట్టా అన్నారు. మహేష్ విట్టా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus