ప్రిన్స్ మాట ఇచ్చాడు…ఉగాదికే…!!!

టాలీవుడ్ ను శాసిస్తున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు…ఇంకా చెప్పాలి అంటే….టాలీవుడ్ టాప్ హీరోగా ప్రిన్స్ కు మంచి క్రేజ్ ఉంది….అటు మాస్ హీఎరొగానే కాకుండా…ఇటు క్లాస్ హీరోగా కూడా ప్రిన్స్ కు ఫ్యాన్ బేస్ చాలా బాలంగా ఉంది…ఇదిలా ఉంటే ప్రిన్స్ లాస్ట్ మూవీ బ్రహ్మోత్సవం బడా డిజాస్టెర్ గా మారి అభిమానుల్ని తీవ్ర నిరాశ పరిచింది. అయితే అదే క్రమంలో ఈ సారి రాబోయే సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలి అని పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాడు మన ప్రిన్స్  అదే క్రమంలో…మురుగదాస్ దర్శకత్వంలో ఇటు తెలుగులోనే కాకుండా..తమిళంలో కూడా చేస్తున్న ఈ సినిమా టైటిల్ కూడా బయటకు రాలేదు.. ఇక సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా అసలు లీక్ చేయలేదు. అయితే అదిగో….ఫర్స్ట్ లుక్….ఇదిగో టీజర్ అంటూ చాలా సార్లు ఊరించి ఉడికించారు…కానీ ఎక్కడ ఏ వార్త బయటకు రాకపోవడంతో అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు..ఇక అభిమానుల కోసం ఈసారి ఏకంగా ప్రిన్స్ ఈ సినిమా ఫర్స్ట్ లుక్ గురించి మాట ఇచ్చాడు.

ప్రిన్స్….ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు స్వయంగా మహేష్ బాబే తన సినిమా టీజర్ ఉగాదికి వచ్చేస్తుందని చెప్పేశాడు. ఇన్నాళ్లు సినిమా గురించి టీజర్ గురించి అఫిషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు మహేష్. నిన్న జరిగిన యప్ టివి ఒరిజినల్స్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ తన సినిమా టీజర్ డేట్ చెప్పేశాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మురుగదాస్ సినిమా టీజర్ డేట్ ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది మహేష్ బాబుకి. సమాధానం చెప్పక తప్పలేదు. మే బి ఉగాదికి సినిమా టీజర్ వచ్చే అవకాశాలున్నాయని అన్నాడు. మహేష్ చెప్పాడంటే కచ్చితంగా ఉగాదికి సినిమా టీజర్ వచ్చేసినట్టే. సంభవామి, ఏజెంట్ శివ, అభిమన్యి కొత్తగా మర్మం ఇలా రోజుకో కొత్త టైటిల్ వినిపిస్తున్న మురుగదాస్ మహేష్ సినిమా అసలు టైటిల్ ఏది ఫిక్స్ చేస్తారో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 80కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది….మరి ఈ సినిమా ఫర్స్ట్ లుక్….టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus