సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తికావచ్చింది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని జూన్ 23 న రిలీజ్ చేస్తానని మురుగదాస్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కీలక డేట్స్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. ప్రిన్స్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా చూడాలంటే ఉగాది (మార్చి 29 ) వరకు ఆగాల్సిందే. అప్పుడే ఫస్ట్ లుక్ విడుదలకానుంది. టైటిల్ కూడా రివీల్ కానుంది. లండన్లో మెరుగులు దిద్దుకుంటున్న టీజర్ ని ఏప్రిల్ 14 న రిలీజ్ చేయనున్నారు.
ఇక హరీష్ జయరాజ్ పాటలను మే 28 న విననున్నాం. ఆరోజు ఆడియో రిలీజ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా, తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. వందకోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.