Major Collections: బ్రేక్ ఈవెన్ కు చేరువలో మేజర్..!

Advertisement

అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా శశి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ ‘ఎ ప్లస్ ఎస్ మూవీస్’ బ్యానర్ల పై మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది.

రెండో రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 3.31 cr
సీడెడ్ 0.86 cr
ఉత్తరాంధ్ర 0.97 cr
ఈస్ట్ 0.65 cr
వెస్ట్ 0.44 cr
గుంటూరు 0.51 cr
కృష్ణా 0.50 cr
నెల్లూరు 0.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.55 cr
ఓవర్సీస్ 4.2 cr
రెస్ట్ 1.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.36 cr

‘మేజర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.13.36 కోట్ల షేర్ ను రాబట్టింది.రెండో రోజు పెద్ద సినిమాల రేంజ్ లో కలెక్ట్ చేసింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus