Faria Abdullah: ఫరియా అద్బుల్లాకి ఇది మంచి ఛాన్సే..హిట్ అయితే!

‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) తో టాలీవుడ్..కి ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) .. ఆ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఫరియా దక్కిన ఇంకో బెనిఫిట్ ఏంటంటే.. కామెడీ కూడా అద్భుతంగా పండించగలదు అని ప్రూవ్ చేసుకుంది. ‘ఇచ్చేయండి సార్.. బెయిల్ ఇచ్చేయండి’ అంటూ ఆమె పలికిన డైలాగ్ థియేటర్లలోని ప్రేక్షకులను ఓ రేంజ్లో నవ్వించింది. అయితే ఆ సినిమా తర్వాత ఫరియా కెరీర్లో సరైన సక్సెస్ పడలేదు.

Faria Abdullah

చెప్పుకోడానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) ‘బంగార్రాజు’ (Bangarraju) (స్పెషల్ సాంగ్) , ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ (Like Share Subscribe) , ‘రావణాసుర’ (Ravanasura) ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) వంటి పెద్ద సినిమాల్లో నటించింది. అయితే ఏదీ కూడా ‘జాతి రత్నాలు’ రేంజ్లో సక్సెస్ కాలేదు. ‘కల్కి 2898 ad ‘ (Kalki2898 AD) లో క్యామియో ఇచ్చింది కానీ..అందులో ‘ఆమె ఫరియానా?’ అని డౌట్ పడేలోపు మాయమైపోతుంది. అయినప్పటికీ ఫరియాకి ఇప్పుడు ఓ మంచి ఛాన్స్ లభించింది. అదేంటంటే.. ‘మత్తువదలరా 2’  లో ఆమె కూడా నిథి అనే ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈరోజు బయటకు వచ్చింది. రితేష్ రానా సినిమా కాబట్టి.. కామెడీకి ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది. ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) సీక్వెల్ కాబట్టి.. అది మాండేటరీ.సో ‘జాతి రత్నాలు’ తర్వాత ఫరియా కూడా తన మార్క్ కామెడీతో అలరించే ఛాన్స్ ఉంటుంది. సినిమా హిట్ అయితే.. ఆమెకు ఇంకా ప్లస్ అయినట్టే..! లేదు… ఆమెను ‘ఈ సినిమాలో గ్లామర్..కే వాడుకున్నారా?’ అనేది తెలియాలంటే సెప్టెంబర్ 13 వరకు ఆగాల్సిందే.

క్రేజీ కాంబినేషన్ సినిమా ఆఫీస్ ఖాళీ అయిపోయిందట.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus