ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్తకి విడాకులిచ్చి గత కొంత కాలంగా అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పార్టీలకు, ఈవెంట్స్ కి వెళ్ళడం వంటివి చేస్తుండడం వైరల్ గా మారాయి. ఇటీవల వీరిద్దరూ ఓ పార్టీకి హాజరయ్యారు … ఈ పార్టీకి అర్జున్ కజిన్ అయిన హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా హాజరయ్యింది.
విషయం ఏటంటే… అక్కడ మలైకా.. సోనమ్ ని అవమానించిదట. అంతే కాదు ఈ పార్టీలో ఎంజాయ్ చేస్తూ మలైకా కాస్త ఎక్కువగా మద్యం తీసుకుని చేసిన రచ్చని అర్జున్ కపూర్ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదట. ఈ క్రమంలో సోనమ్ కపూర్ .. మలైకా వద్దకు వెళ్ళి నేను సాయం చేస్తానని అడిగినప్పటికీ… దానికి ఆమె.. ‘స్టే అవే (దూరంగా వెళ్లు)’ అని పొగరుగా సమాధానం చెప్పడంతో సోనమ్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యిందని తెలుస్తుంది. దాంతో అక్కడున్నవారంతా సోనమ్ నే చేస్తుండడంతో కాస్త అవమానంగా ఫీలయ్యిందట. అర్జున్, మలైకాల ప్రేమను ఇప్పటి వరకూ సపోర్ట్ చేస్తూ వచ్చింది సోనమ్. అయితే ఈ సంఘటన ఆమె చాలా హర్ట్ అయ్యిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి…!