‘తంగలాన్’ (Thangalaan) సినిమా నుండి హీరోయిన్ మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ‘అందగత్తెను ఇలా చేసేశారేంట్రా బాబూ..’ అని అనుకోని అభిమాని ఉండరు. సోషల్ మీడియాలో మోస్ట్ బోల్డ్ ఫొటో షూట్లతో అదరగొట్టే ఈ భామను డిఫరెంట్ లుక్‌లో చూపించారు. ఆ డీగ్లామరస్ లుక్‌లో ఆమెను చూసినవాళ్లు ఎవరైనా ఇదే మాట అంటారు అనుకోండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ లుక్ కోసం, ఆ సినిమా కోసం పడ్డ కష్టాలు వింటుంటే వామ్మో అనిపిస్తోంది.
‘తంగలాన్’ సినిమాలో విక్రమ్ (Vikram) హీరో అనే విషయం తెలిసిందే. నటీనటులందరూ డీ గ్లామర్ రోల్స్ కనిపిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan) , పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మాళవిక మోహనన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఒక రోజు సెట్‌కు వెళ్లేసరికి పెద్ద గేదెను తీసుకొచ్చారట.
ఆ తర్వాత దర్శకుడు వచ్చి గేదెను ఎక్కగలవా అన్నారట. ఏదో సరదాగా అంటున్నారు అనుకుందట మాళవిక. అయితే కాసేపటికి ఆమె మేకప్ పూర్తయిన తర్వాత వచ్చాక నిజంగానే గేదెపై ఎక్కడి కూర్చోమన్నారట. గేదెపైకి ఎక్కిన అనుభవం మాళవికకు లేదట. ఆ మాట చెప్పే ప్రయత్నం చేసినా దర్శకుడు వినలేదట. సన్నివేశం చిత్రీకరించాలి ఎలాగైనా గేదెపై కూర్చోవాలని అడిగారట. దీంతో భయంతోనే ఎక్కిందట. సినిమా కథ నెరేట్ చేసినప్పుడు, సన్నివేశాలు చెప్పినప్పుడు అలాంటి సన్నివేశం గురించి చెప్పలేదట దర్శకుడు.
ఇక ఈ సినిమా రోజూ ఐదు గంటలు మేకప్ వేసుకోవాల్సి వచ్చిందట. దాదాపు 10 గంటలపాటు కెమికల్స్‌తో చేసిన మేకప్ శరీరంపై ఉండేసరికి ఎలర్జీ వచ్చిందట. దీంతో వైద్యుల్ని సంప్రదించాల్సి వచ్చింది అని చెప్పింది మాళవిక. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఇంకాస్త ఆశ్చర్యపోవచ్చు అని సినిమా టీమ్ చెబుతోంది. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు సినిమాలో ఉన్నాయి అని అంటున్నారు.