Mythri Movie Makers: ఎంతమంది ట్రై చేసినా.. చివరికి ‘మైత్రి’ వారికే సెట్ అయ్యింది..!

Advertisement

దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి బడా నిర్మాతలనే ఓవర్ టేక్ చేసే దిశగా దూసుకుపోతున్నారు ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాతలు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కలుపుకుని ఏకంగా ఈ 2 ఏళ్ళ పాటు 14 సినిమాలతో వీరు బిజీ కాబోతున్నారు. కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా వీళ్ళు సినిమాలు చెయ్యడానికి రెడీ అయ్యారు. చిరంజీవి,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్, సల్మాన్ ఖాన్.. వంటి స్టార్ హీరోలతో వీరు సినిమాలు చెయ్యబోతున్నారు. వాటి బడ్జెట్ మొత్తం కలిపి రూ.1000 కోట్ల వరకూ ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

ఈ నిర్మాతల గట్స్ కు నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఇదిలా ఉండగా.. వీళ్ళు చాలా మంది నిర్మాతలకు అసాధ్యమైన మరో రేర్ ఫీట్ ను కూడా సాధించారట. అదేంటి అనుకుంటున్నారా? మలయాళంలో ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ వంటి నటీనటులు ఎంత పెద్ద స్టార్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళ నటన కూడా ఆ స్థాయిలో ఉంటుంది.వీళ్ళిద్దరూ భార్యా భర్తలు అన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ నజ్రియా ‘రాజా రాణి’ అనే తమిళ డబ్బింగ్ మూవీతో పరిచయమైంది. ఫహాద్ ఫాజిల్ కూడా ఆహా ఓటిటిలో విడుదలైన ‘ట్రాన్స్’ అనే మలయాళం డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

అందులో నజ్రియా కూడా నటించింది. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరు స్టార్లను టాలీవుడ్ కు తీసుకురావాలని గతంలో చాలా మంది దర్శక నిర్మాతలు ట్రై చేశారట. కానీ అది ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ‘మైత్రి’ వారికి మాత్రమే సాధ్యమైంది. వారు అల్లు అర్జున్ తో నిర్మిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే నానితో నిర్మిస్తున్న ‘అంటే సుందరానికి?’ చిత్రంలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాల్లో నటించడం కోసం ఈ భార్యా భర్తలకు భారీ ఎత్తున అంటే కోట్లల్లో పారితోషికం ఆఫర్ చేశారట ‘మైత్రి’ వారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news