Mallika Sherawat: అవకాశాలు రావాలంటే బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందేనా..?

ఒకప్పుడు బాలీవుడ్ లో శృంగార తారగా అలరించిన మల్లికా షెరావత్ ఆ తరువాత పెద్దగా రాణించలేకపోయింది. ‘మర్డర్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. ఇదే విషయంపై స్పందించిన మల్లికా బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ టైమ్ లో తనకు బాలీవుడ్ అవకాశాలు రాలేదనే మాట నిజమని చెప్పింది. తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని..

కనీసం బాలీవుడ్ లో బాయ్ ఫ్రెండ్ కూడా లేడని చెప్పింది. బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటే తనకు కూడా సినిమా ఆఫర్లు వచ్చేవని.. అయినప్పటికీ తను బాధ పడలేదని.. వచ్చిన అవకాశాలు చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో రాణించాలంటే బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందేనని పరోక్షంగా చెబుతోంది మల్లికా. ‘మర్డర్’ సినిమాలో చేసిన ఎరోటిక్ సన్నివేశాలు చూసిన తరువాత తనతో డేటింగ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని..

అయినప్పటికీ తను అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదని చెప్పింది. ‘మర్డర్’లో తను చేసిన సన్నివేశాలు అప్పట్లో సంచలనం సృష్టించినప్పటికీ.. ఇప్పుడు అలాంటి సీన్లు చాలా కామన్ అయిపోయాయని చెప్పింది. ఈ విషయంలో బాలీవుడ్ బాగా డెవలప్ అయిందని సెటైర్ వేసింది.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus