సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ మూవీ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు.. లు నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ‘సృష్టి సెల్యులాయిడ్’ సోనాలి నారంగ్, సృష్టి సమర్పకులుగా వ్యవహరించారు. హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల అయ్యింది. అయితే మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు అస్సలు బాలేదంటూ పెదవి విరిచారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా మెరుపులు మెరిపించింది అంటూ ఏమీ లేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.12 cr
సీడెడ్
0.06 cr
ఉత్తరాంధ్ర
0.13 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
0.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
0.03 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.34 cr
‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra) చిత్రానికి రూ.3.38 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.75 కోట్ల షేర్ ను రాబట్టాలి.సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో మొదటి వీకెండ్ కేవలం రూ.0.34 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి తీయకుండా అని చెప్పాలి.