టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మమతా మోహన్ దాస్ యమదొంగ సినిమాలో తారక్ కు జోడీగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మమతా మోహన్ దాస్ కు మంచి గుర్తింపు ఉంది. అయితే మమతా మోహన్ దాస్ అరుదైన వ్యాధి బారిన పడ్డారని తెలిసి ఆమె అభిమానులు షాకవుతున్నారు. తెలుగులో మమతా మోహన్ దాస్ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా ఆమె ఆకట్టుకోలేదు.
మమతా మోహన్ దాస్ సోషల్ మీడియా వేదికగా తాను బొల్లి వ్యాధితో బాధ పడుతున్నానని వెల్లడించడం గమనార్హం. చాలా సంవత్సరాల క్రితం మమతా మోహన్ దాస్ క్యాన్సర్ బారిన పడగా తర్వాత రోజుల్లో ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుంది. ఆ తర్వాత ఈ నటి లింఫోమా అనే వ్యాధి బారిన పడగా ఆ వ్యాధి నుంచి కూడా కోలుకున్నారు. ప్రస్తుతం ఈ నటి బొల్లి వ్యాధి బారిన పడగా ఈ వ్యాధి వల్ల ఆమె చర్మం రంగును కోల్పోతుంది.
మమతా మోహన్ దాస్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోను షేర్ చేస్తూ అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్టు వెల్లడించారు. క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో తాను బాధ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు మమతా మోహన్ దాస్ ఫైటర్ అని త్వరలోనే ఆమె ఈ వ్యాధి నుంచి కోలుకుని సాధారణ మనిషి అవ్వాలని చెబుతుండటం గమనార్హం.
ఈ వ్యాధి కొంతమేర ప్రమాదకరమైన వ్యాధి అని అయితే సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవడం కష్టం కాదని సమాచారం అందుతోంది. మలయాళ మూవీ జనగణమన మమతా మోహన్ దాస్ చివరి మూవీ కావడం గమనార్హం. మమతా మోహన్ దాస్ మళ్లీ సినిమాలలో యాక్టివ్ కావాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?