తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మెప్పించిన మమత మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. తన జీవితంలో రెండుసార్లు క్యాన్సర్ బారిన పడిన ఈమె ధైర్యంగా క్యాన్సర్ ను జయించారు. అయితే క్యాన్సర్ నుంచి బయటపడిన ఈమెకు మరో సమస్య వెంటాడుతుంది. వీటిలిగో అనే అనారోగ్య సమస్యతో మమతా మోహన్ దాస్ బాధపడుతున్నారు.
ఇలా తాను ఈ సమస్యతో బాధపడుతున్నాను అంటూ తన సమస్య గురించి అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తన కెరియర్ చాలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు.
తాను యమదొంగ సినిమాలో నటించడం కంటే ముందుగా అరుంధతి సినిమా అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. అయితే తన మేనేజర్ ఆ సినిమా నిర్మాణ సంస్థ మంచిది కాదని తెలియచేయడంతో తాను ఈ సినిమాలో నటించడానికి సంకోచించాను. అప్పట్లో నాకు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి తెలియక పోవడం వల్ల నా కోసం శ్యాంప్రసాద్ రెడ్డి గారు దాదాపు రెండు మూడు నెలలు వెయిట్ చేశారు. అయితే నేను ఈ సినిమాలో నటించననీ తెలియజేశాను.
ఈ సినిమా వదులుకున్న తర్వాత రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో చేశాను.ఆ సమయంలో రాజమౌళి గారు నాతో మాట్లాడుతూ అరుంధతి సినిమా వదులుకొని పెద్ద తప్పు చేశావు అని అన్నారు. అలా రాజమౌళి గారు ఆ మాట అనడంతో నాకు గుండె పగిలేనంత పని అయింది అయితే అప్పటికే ఆ సినిమా విడుదల కాలేదనీ ఈమె అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే అరుంధతి సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.