నయనతార నిజస్వరూపం ఇదేనా.. అలాంటి షరతులు పెట్టారా?

సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు సంబంధించి బ్యాగ్రౌండ్ లో ఎన్నో రాజకీయాలు జరుగుతుంటాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు తప్ప ఈ విషయాలు సామాన్య జనాలకు ఎక్కువగా తెలియవు. అయితే ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మమతా మోహన్ దాస్ నయనతారపై పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ నటించిన ఒక సినిమాలో తనకు ఛాన్స్ దక్కిందని ఆమె అన్నారు. ఆ సినిమాలో ఒక సాంగ్ కోసం నన్ను సంప్రదించారని మమత కామెంట్లు చేశారు.

దాదాపుగా నాలుగు రోజుల పాటు ఆ సాంగ్ షూట్ జరిగిందని మమత చెప్పుకొచ్చారు. షూట్ చేస్తున్న సమయంలోనే ఆ ఫ్రేమ్ లో నేను లేనని అర్థమైందని ఒకే ఒక్క షాట్ లో మాత్రం వెనుక నుంచి కనిపిస్తానని మమత తెలిపారు. నాకు చెప్పిన విధంగా సాంగ్ షూట్ జరగలేదని ఎవరైతే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారో ఆమె వల్ల ఈ విధంగా జరిగిందని మమత తెలిపారు. ఆ సినిమాలో హీరోయిన్ వల్లే ఈ విధంగా జరిగిందని తర్వాత తెలిసిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ సాంగ్ లో మరో హీరోయిన్ ఉంటే నేను షూట్ కు రానని ఆ హీరోయిన్ చెప్పడంతో నా పార్ట్ షూట్ జరగలేదని మమత తెలిపారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కథానాయకుడు సినిమా గురించి మమత ఈ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే పరోక్షంగా మమత నయన్ పేరు ప్రస్తావించకుండా ఈ కామెంట్లు చేశారు.

కథానాయకుడు సినిమాలో దేవుడే స్వర్గం నుంచి సాంగ్ లో మమతా మోహన్ దాస్ కొన్ని సెకన్ల పాటు మెరిశారు. నయనతార ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మమత మోహన్ దాస్ టాలెంట్ ఉన్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. సింగర్ గా కూడా మమతా మోహన్ దాస్ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus