Manchu Lakshmi: సమంత వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తి… సమంతపై ప్రశంసలు కురిపించిన మంచు లక్ష్మి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మోహన్ బాబు వారసురాలిగా అడుగుపెట్టారు నటి మంచు లక్ష్మి. ఇలా ఇండస్ట్రీలో నటిగా తనని తాను నిరూపించుకోవడం కోసం విభిన్న కథా చిత్రాల ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా మంచు లక్ష్మి వంశీకృష్ణ దర్శకత్వంలో తన సొంత నిర్మాణంలో అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఇక ఈ సినిమాలో మొదటిసారి ఈమె తన తండ్రి మోహన్ బాబు, తన కుమార్తె నిర్వాణతో కలిసి నటించబోతున్నారు.

శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా నుంచి తాజాగా తెలుసా తెలుసా అనే ఒక పాటను విడుదల చేశారు. ఈ పాట ఉమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించినది కావడంతో మహిళా దినోత్సవం సందర్భంగా సమంత చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. ఈ క్రమంలోనే నటి మంచు లక్ష్మి ఈ సందర్భంగా సమంతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడమే కాకుండా సమంత గురించి మహిళా దినోత్సవం రోజున మంచు లక్ష్మి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సమంత వ్యక్తిత్వానికి నిదర్శనం ఇండస్ట్రీలో ఉండే మహిళలు ఇలాగే ఉండాలి. సమంతతో పాటు ఆమె అనుభవించిన కష్టాలను, ఎదుర్కొన్నటువంటి తీరును దగ్గరుండి చూసాను. అంతేకాదు సమంత స్థానంలో మరెవరున్నా కూడా నలిగిపోయేవారు. జీవితంలో క్లిష్ట దశలో కూడా తనని తాను మలుచుకున్న తీరు ఎందరికో స్ఫూర్తి అంటూ మంచు లక్ష్మి ఈ సందర్భంగా సమంత గురించి ఆమె అనుభవించిన కష్టాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా నిజమైన మహిళా సాధికారత పొందిన ఉమెన్స్ డే రోజున ఈ సినిమా నుంచి ఇలాంటి పాట విడుదల చేయడం నిజంగా మరింత శక్తిని ఇస్తుంది అంటూ మంచు లక్ష్మి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus