Manchu Lakshmi: హీరోయిన్లను వెనక్కి నెట్టి ఆ గౌరవం అందుకున్న మంచు వారసురాలు?

  • August 19, 2022 / 07:17 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మంచు వారసురాలుగా అడుగుపెట్టిన మంచు లక్ష్మి ఎన్నో టీవీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇకపోతే ఈమె నటిగా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు.అయితే ఇప్పటివరకు ఈమె పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు వచ్చిన సినిమాలు లేవని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో సరైన బ్రేక్ రానప్పటికీ సరికొత్త కథలను ఎంపిక చేసుకుని ఏదో ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఈమె పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇక చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరగటం వల్ల మంచు లక్ష్మి భాషకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఈ విధంగా ఇటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన సంపాదించుకున్న ఈమె తాజాగా ఓ అరుదైన గౌరవం అందుకున్నారు.

TC కండ్లెర్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రకటించే 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ లిస్ట్ లో మంచు లక్ష్మి చోటు సంపాదించుకున్నారు. అయితే హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి మంచు లక్ష్మి బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ లిస్టులో పేరు సంపాదించుకోవడం విశేషం. 1990ల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులకు, TV పర్సనాలిటీస్ కు, కే పాప్ ఆర్టిస్టులకు ఈ లిస్టులో చోటు కల్పిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోని ఈ ఏడాది మంచు లక్ష్మితో పాటు ఈ లిస్టులో మహీరా ఖాన్, రామ్ చరణ్, మానుషీ చిల్లర్ కూడా ఉన్నారు.ఇలా మంచు లక్ష్మి ఈ లిస్టులో చోటు సంపాదించుకోవడంతో మంచు అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం వంటి సినిమాలలో నటిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus