పెళ్ళిరోజే చాలా కంగారు పడ్డాను: మంచు లక్ష్మీ

ఇప్పుడు లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీలంతా ఇళ్ళల్లోనే ఉంటున్నారు. కొందరు వారి ఫ్యామిలీ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటే మరికొంత మంది వారి చిన్నప్పటి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ కూడా తన పాత ఫోటోలను పోస్ట్ చేసింది. అది కూడా ఆమె పెళ్ళి ఫోటోలు కావడం విశేషం. తన పెళ్ళినాటి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి.. అప్పటి లుక్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది.

‘పెళ్ళి కూతురిని మండపంలోకి తీసుకురమ్మని చెప్పిన సమయంలో .. నాకు చాలా భయమేసింది. అంతేకాదు చాలా కంగారుపడ్డాను కూడా..! బయటకి పారిపోవాలని దారి కూడా వెతుక్కుంటున్నాను’ అంటూ లక్ష్మి మంచు చెప్పుకొచ్చింది. 2006 లో ఆండీ శ్రీనివాస్ ను వివాహం చేసుకుంది లక్ష్మీ మంచు. ఆ సమయంలో మోహన్ బాబుతో కలిసి తీయించుకున్న ఫోటోని కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మంచు లక్ష్మీ పలు టీవీ షో లకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ ‘దొంగాట’ ‘గుండెల్లో గోదారి’ ‘ఊకొడతారా.. ఉలిక్కిపడతారా’ అనే చిత్రాల్లో తన నటనతో ఎంతో ఆకట్టుకుంది. ‘మిసెస్ సుబ్బలక్ష్మీ’ వంటి వెబ్ సిరీస్ లో కూడా నటించింది. సరోగసి పద్ధతి ద్వారా ఈమె ఓ పాపకి తల్లి కూడా అయ్యింది. తన పాపతో ఉన్న ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది మంచు లక్ష్మీ.

1

2

3

4

5

6

7

8

9

10


Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus