టాలీవుడ్లో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మంచు లక్ష్మితో పెట్టుకోకూడదు అంటుంటారు. ఎందుకంటే తండ్రి నుండి నిర్భయం, ఉన్నది ఉన్నట్లు చెప్పడం, అవసరమైతే మాడు పగలగొట్టే సమాధానాలు ఇవ్వడం లాంటి గుణాలను పునికి పుచ్చుకుంది. అందుకే ఆమెతో మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. అయితే కొంతమంది నెటిజన్లు ఈ విషయం తెలియక ఆమె గురించి ఏదేదో కామెంట్లు చేస్తుంటారు. దానికి ఆమె గట్టిగా రిటార్ట్ ఇస్తుంటారు కూడా. తాజాగా ఇదే జరిగింది.
‘‘డబ్బు మనకు కేవలం స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. కొంతమంది అనుకునేలా సంతోషాన్ని కాదు’’ అంటూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఏమైందా అని ఆమె ట్విటర్ టైమ్‌లైన్‌లోకి వెళ్లి చూస్తే… ఆమె ఓ విషయంలో చేసిన కామెంట్స్ విత్ ఫొటో కనిపించాయి. ఆ విషయం ఏంటనేది తర్వాత చూద్దాం. ముందు ఆమె కామెంట్ల సంగతి చూద్దాం. ‘‘అందరికీ నమస్కారం. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్ శుభ్రంగా లేదని వీడియో పెట్టాను.
నా ఐఫోన్‌తో తీసిన ఫొటో వల్ల ఇంకా బాగా కనపడుతోందని అన్నాను. దాంతో అందరూ నా మీద కామెంట్లు మొదలుపెట్టారు’’ అని చెప్పుకొచ్చింది లక్ష్మి. ‘ఓహో.. నువ్వు బిజినెస్ క్లాస్‌లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్ ఉందా’ అని కొందరు కామెంట్లు పెట్టారు. అయినా నాకు వాళ్లేమైనా ఫోన్ కొనిచ్చారా? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు… ఈ విషయంలో మీకేం నొప్పి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.
అదేదో నేను బిజినెస్ క్లాస్‌లో ట్రావెల్ చేయడం, యాపిల్ ఫోన్ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. అయినా మేం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీకేంటి ఇబ్బంది అని ప్రశ్నించారు. నేను డబ్బులు సంపాదించడానికి కష్టపడతా. మా అమ్మానాన్న దగ్గర మేం డబ్బులు తీసుకోం అని చెప్పింది. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని అంటుంటారు.
నేను ఆ మాటలకు అంగీకరించను. అమెరికాలో ఉన్నప్పుడు రోజూ కష్టపడి పని చేశాను. అదంతా రోజు తిండి కోసమే. ఒక్క విషయం అర్థం చేసుకోండి డబ్బు మనకు స్వేచ్ఛ మాత్రమే ఇస్తుంది అంతే, ఆనందం కాదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన మంచు లక్ష్మి (Manchu lakshmi) అక్కడ కార్పెట్ అపరిశుభ్రం ఉందని ఎయిర్ ఇండియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దానికే ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!